Pawan Kalyan: మా పార్టీ అధికారంలోకి వచ్చాక ఉత్తమపాలన చూస్తారు: పవన్‌ కల్యాణ్‌

  • సామాజిక సమస్యలు రూపుమాపేందుకే జనసేన పోరాటం
  • వెనకబాటు అనేది సామాన్య ప్రజలకే పరిమితం అవుతోంది
  • తమకున్న జబ్బులను కూడా గుర్తించలేని పేదరికం
తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉత్తమపాలన చూస్తారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ రోజు శ్రీకాకుళంలో నిరాహార దీక్ష విరమించిన అనంతరం ఆయన మాట్లాడారు. జనసేన పోరాటం రాజకీయ అధికారం కోసం కాదని, సామాజిక సమస్యలు రూపుమాపేందుకేనని అన్నారు. వెనకబాటు అనేది కేవలం సామాన్య ప్రజలకే పరిమితం అవుతోందని, తమకున్న జబ్బులను కూడా గుర్తించలేని పేదరికంలో ప్రజలు ఉన్నారని అన్నారు.

విదేశీయాత్రలకు, ఖరీదైన హోటళ్లలో బస చేయడానికి డబ్బులు ఉంటాయి కానీ, ఉద్ధానం బాధితులను ఆదుకోవడానికి మాత్రం ఉండవా? అని ప్రభుత్వ పెద్దలను పవన్ ప్రశ్నించారు. పైకి చిరునవ్వు.. వెనక నుంచి వెన్నుపోటు పొడవాలని కొందరు చూస్తున్నారని, తాము అమాయకులం కాదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.
Pawan Kalyan
Jana Sena
Srikakulam District

More Telugu News