Pawan Kalyan: నిమ్మరసం తాగి.. నిరాహార దీక్ష విరమించిన పవన్ కల్యాణ్

  • 24 గంటలు సాగిన నిరాహార దీక్ష
  • పవన్‌కు నిమ్మరసం ఇచ్చిన కిడ్నీ బాధిత కుటుంబ చిన్నారి
  • రాష్ట్ర ప్రభుత్వం కిడ్నీ బాధితులను ఆదుకోవాలని పవన్ డిమాండ్‌
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన నిరాహార దీక్ష విరమించారు. ఆయనకు కిడ్నీ బాధిత కుటుంబ చిన్నారి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసింది. ఉద్ధానంలోని కిడ్నీ బాధితుల సమస్యలను తీర్చాలంటూ చేసిన తన డిమాండ్‌లను ఏపీ సర్కారు పట్టించుకోవట్లేదంటూ నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు శ్రీకాకుళంలో తాను బస చేస్తోన్న రిసార్టులోనే పవన్‌ నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. అనంతరం సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం పట్టణంలో ప్రజల మధ్యే పవన్‌ నిరాహార దీక్ష చేశారు.
 
Pawan Kalyan
Jana Sena
Srikakulam District

More Telugu News