sridevi: శ్రీదేవి కుమార్తె జాన్వీ కోసం ఎగబడ్డ అభిమానులు.. వీడియో వైరల్

  • బంద్రాలో జాన్వీని చుట్టుముట్టిన అభిమానులు
  • కోప్పడకుండా, చిరునవ్వులు చిందించిన జాన్వీ
  • ముంబై బాంద్రాలో ఘటన
తన తొలి బాలీవుడ్ సినిమా 'ధడక్' రిలీజ్ కాకముందే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కు స్టార్ ఇమేజ్ వచ్చేసింది. సీనీ అభిమానుల్లో ఆమెకు ఇప్పటికే భారీ క్రేజ్ ఏర్పడింది. తాజాగా అభిమానుల అభిమానం ఆమెకు ఒకింత ఇబ్బందిని కలిగించింది. ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన జాన్వీపైకి అభిమానులు ఎగబడ్డారు. ఆమెను తాకడానికి, తమ ఫోన్లలో బంధించేందుకు విశ్వయత్నం చేశారు. అయితే, ఆమె ఏ మాత్రం సీరియస్ కాలేదు. తన పర్సనల్ సెక్యూరిటీ అండతో చిరువవ్వులు చిందిస్తూ కారెక్కి కూర్చుని, వెళ్లిపోయింది. 
sridevi
fans
mobbing
bollywood

More Telugu News