Rahul Gandhi: నాలుగేళ్ల మోదీ పాలనపై రాహుల్ గాంధీ ఇచ్చిన రిపోర్ట్!

  • అన్నింటిలో ఫెయిల్, ప్రచారంలో పాస్
  • ఏకాగ్రత లేమి, క్లిష్టసమస్యలతో బాధపడుతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు
  • ట్విట్టర్ లో ఆసక్తికరంగా పోస్ట్
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తయింది. 2014 మే 26న అధికార బాధ్యతలు చేపట్టారు. ఈ నాలుగేళ్ల కాలంలో మోదీ ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ముఖ్యంగా నోట్ల రద్దుతో ప్రజలను బ్యాంకుల వెంట పరుగెత్తించారు. జీఎస్టీ చట్టంతో దేశవ్యాప్తంగా ఒకే పన్నును తెచ్చారు. అందరికీ సమగ్ర వైద్య బీమా పథకాన్ని ప్రకటించారు కానీ ఇంకా అమల్లోకి రాలేదు. నరేంద్ర మోదీ నాలుగేళ్ల పరిపాలనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ పరీక్షా నివేదికను ట్విట్టర్లో పెట్టారు. ఆయన ట్వీట్ ఇలా ఉంది.

నాలుగేళ్ల రిపోర్ట్ కార్డు

వ్యవసాయం : ఎఫ్

విదేశాంగ విధానం : ఎఫ్

ఇంధన ధరలు : ఎఫ్

ఉద్యోగాల కల్పన : ఎఫ్

నినాదాలు సంధించడం : ఎ+

సొంత డబ్బా : ఎ+

యోగా : బి-

పరిశీలనలు :

మాటలు చెప్పడంలో మాస్టర్; క్లిష్టమైన సమస్యలు; ఏగాత్ర లేమి
Rahul Gandhi
Narendra Modi
4 years

More Telugu News