Guntur District: ఏపీ ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే కేంద్రానికి దూరం జరిగింది: బీజేపీ ఎంపీ హరిబాబు

  • ఏపీకి అన్నివిధాలుగా సహకరించాం
  • విభజన హామీల్లో 85 శాతం అమలు చేశాం
  • మిగిలిన హామీలు కూడా అమలు చేస్తాం
ఏపీ ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే కేంద్రానికి దూరం జరిగిందని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు విమర్శించారు. గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్ లో ఎన్డీయే నాలుగేళ్ల విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ పదవీ బాధ్యతలను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీకి నూతన నాయకత్వం లభించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అన్నివిధాలుగా సహకరించామని, విభజన హామీల్లో 85 శాతం అమలు చేశామని, మిగిలినవి కూడా అమలు చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదని మరోసారి స్పష్టం చేశారు.
Guntur District
mp hari babu

More Telugu News