Chandrababu: చంద్రబాబు చేతకానితనంతోనే రాష్ట్రం అభివృద్ధి కాలేదు: కన్నా లక్ష్మీనారాయణ

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలను స్వీకరించిన కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేతకానితనం వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదని విమర్శించారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీజేపీపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని... ఆయన ప్రచారాలను ఎండగడతామని చెప్పారు.

కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని... అవసరం తీరిపోయాక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరం కలసికట్టుగా పని చేద్దామని చెప్పారు. గుంటూరులో జరుగుతున్న ఎన్డీయే నాలుగేళ్ల విజయోత్సవ సభలో ప్రసంగిస్తూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 
Chandrababu
kanna lakshminaraya

More Telugu News