mamata banerjee: పశ్చిమబెంగాల్ గవర్నర్ ను పక్కకు తోసేసిన మమతా బెనర్జీ.. వీడియో చూడండి
- మోదీ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటన
- ప్రధానికి అడ్డుగా ఉన్న గవర్నర్ ను తోసిన మమత
- నివ్వెరపోయిన గవర్నర్
రాష్ట్ర గవర్నర్ కేశరీనాథ్ త్రిపాఠిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పక్కకు తోసేసిన ఘటన ఈ రోజు చోటుచేసుకుంది. ప్రధాని మోదీ ఈరోజు పశ్చిమబెంగాల్ లో పర్యటించారు. శాంతినికేతన్ లో జరిగిన ఓ కార్యక్రమంతో పాటు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వాజెద్ కూడా ఉన్నారు.
మోదీ పర్యటన సందర్భంగా శాంతినికేతన్ లో హెలీప్యాడ్ వద్ద ఆయనకు మమత స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ఫొటో సెషన్ సందర్భంగా మోదీకి అడ్డుగా ఉన్న గవర్నర్ ను మమత పక్కకు తోశారు. ఓ క్షణం నివ్వెరపోయిన గవర్నర్ మోదీ వైపు చూశారు. మోదీ కూడా ఏం పర్లేదులే, అక్కడే ఉండండి అన్నట్టుగా చేత్తో సైగ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.