vanteru: గజ్వేల్‌ నుంచి పోటీ చేసి కేసీఆర్‌పై గెలిచి కాంగ్రెస్‌కు బహుమతిగా ఇస్తా: వంటేరు ప్రతాప్‌ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
టీటీడీపీకి గుడ్‌ బై చెప్పిన వంటేరు ప్రతాప్‌ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ... 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలోనే కాక కేంద్రంలోనూ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో గజ్వేల్‌లో తన మీద అతి తక్కువ మెజార్టీతో కేసీఆర్‌ గెలుపొందారని, వచ్చే ఎన్నికల్లో మాత్రం తాను గెలిచి చూపించి, కాంగ్రెస్‌కి బహుమతిగా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాగా, రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మదన్ మోహన్ రావు, పృథ్వీరాజ్‌ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.                 
Go Back to Shorts
vanteru
Congress
New Delhi

More Telugu News