Vijayawada: టీడీపీ సభ్యత్వ కార్డులే ‘మహానాడు’ పాస్ లు!

షార్ట్స్‌లో చూడండి
ఈ నెల 27 నుంచి 29 వరకు విజయవాడలో మహానాడు నిర్వహించనున్న విషయం తెలిసిందే. కానూరులోని సిద్ధార్థ కాలేజ్ లో నిర్వహించనున్న ఈ మహానాడుకు ఎలాంటి పాస్ లు లేవని ఆ పార్టీ నేత టీడీ జనార్దన్ చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సభ్యత్వ కార్డులనే టీడీపీ కార్యకర్తల పాస్ లుగా పరిగణిస్తామని చెప్పారు.

టీడీపీ అధినేత చంద్రబాబు సహా పార్టీకి చెందిన ప్రతిఒక్కరూ తమ సభ్యత్వ నమోదు కార్డులతోనే మహానాడుకు హాజరవుతారని అన్నారు. అయితే, తమ సభ్యత్వ కార్డులు మర్చిపోయిన వారికి ఆన్ లైన్ లో ఇస్తామని, ‘మహానాడు’కు అభిమానులు ఎవరైనా వస్తే వారి ఓటర్ కార్డు నెంబర్ ఆధారంగా సభా ప్రాంగణంలోనే అప్పటికప్పుడు సభ్యత్వ కార్డు జారీ చేస్తామని, సభ్యత్వ నమోదుకుగాను 24 కౌంటర్లు ఏర్పాటు చేశామని జనార్దన్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Vijayawada
Telugudesam
mahanadu

More Telugu News