shaik hasina: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనాకు ఘన స్వాగతం

  • రెండు రోజుల పాటు ప. బెంగాల్ లో పర్యటన
  • ప్రధాన మంత్రితో కలసి బంగ్లాదేశ్ భవన్ ప్రారంభం
  • విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరు
బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా రెండు రోజుల భారత పర్యటనను ఈ రోజు మొదలైంది. ప్రధాని మోదీ రెండు రోజల పాటు పశ్చిమబెంగాల్లో పర్యటించనుండగా, ఆయన ఆహ్వానం మేరకు హసీనా పశ్చిమబెంగాల్ కు విచ్చేశారు. హసీనాకు రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్వాగతం పలికారు. రెండు దేశాధినేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ, హసీనా విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం బంగ్లాదేవ్ భవన్ ను ప్రారంభించారు. మధ్యాహ్నం విందు కార్యక్రమం కూడా ఉంటుంది. అనంతరం ఇరువురి మధ్య ద్వైపాక్షిక అంశాలపై భేటీ ఉంటుందని సమాచారం. తీస్తా నదీ జలాల పంపిణీ ఒప్పందం, రోహింగ్యా శరణార్థుల సమస్య వీరి మధ్య చర్చకు రానున్నాయని భావిస్తున్నారు.
shaik hasina
bangladesh

More Telugu News