Tollywood: ప్రకాష్ రాజ్ అనుసరిస్తున్న విధానం సరైందే: నటుడు ఆదిత్య మీనన్

  • ప్రకాష్ రాజ్ చెప్పే విషయాల్లో వాస్తవం ఉంది
  • అందుకే ఆయనకు మద్దతు పలుకుతున్నా
  • అధికారంలో ఉన్న వారిని ప్రశ్నిస్తే దేశద్రోహులనే ముద్ర వేస్తారా?
బీజేపీ ప్రభుత్వం తీరుపై ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నటుడు ఆదిత్య మీనన్ నిలిచాడు. ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య మీనన్ మాట్లాడుతూ, ప్రకాష్ రాజ్ అనుసరిస్తున్న విధానం సరైందేనని, ఆయన చెప్పే విషయాల్లో వాస్తవం ఉందని, అందుకే ఆయనకు మద్దతు పలుకుతున్నానని చెప్పాడు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నిస్తే దేశద్రోహులనే ముద్ర వేయడం తగదని, అలా ప్రశ్నించకుండా వదిలేస్తే దేశం ఏమైపోతుందని ప్రశ్నించారు.
Tollywood
Prakash Raj
aditya menon

More Telugu News