BJP: ఏం జరుగుతుందో చూడాలన్న ఆత్రుత ఉంది: బీజేపీయేతర కూటమిపై కమలహాసన్‌

  • నిన్న పలు పార్టీల అధినేతలంతా కలిశారు
  • వ్యూహాలను పంచుకోవడానికి ఇదో మంచి వేదిక
  • కార్యరూపం దాల్చడానికి ఇదే మంచి సమయం 
  • బీజేపీయేతర కూటమి మంచిదే
కాంగ్రెస్‌తో జతకట్టిన జేడీఎస్‌ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీతో పాటు ప్రాంతీయ పార్టీల అధ్యక్షులంతా బీజేపీ తీరుపై చర్చలు జరిపారు. 2019 ఎన్నికల్లో వారంతా కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతారని జరుగుతోన్న చర్చపై సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత కమలహాసన్‌ స్పందించారు.

ప్రమాణ స్వీకారానికి తనను ఆహ్వానించినందుకు కుమారస్వామికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని కమల్‌ అన్నారు. అలాగే, ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. పలు పార్టీల అధినేతల వ్యూహాలను పంచుకోవడానికి, ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి ఇదే మంచి సమయమని అన్నారు. బీజేపీయేతర కూటమి మంచిదే అని, అయితే, ఏం జరుగుతుందో చూడాలన్న ఆత్రుత తనకు ఉందని అన్నారు.
BJP
Kamal Haasan
Congress

More Telugu News