motkupalli: చంద్రబాబును నేను ఒక్క మాట కూడా అనలేదు..అయినా నన్ను దూరం పెట్టారు!: మోత్కుపల్లి

  • మూడేళ్లుగా చంద్రబాబు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు
  • నన్ను దూరం పెట్టడం బాధాకరంగా ఉంది
  • చంద్రబాబు నన్ను పిలిచి మాట్లాడతారని ఆశిస్తున్నా
హైదరాబాదులో ఈరోజు జరిగిన తెలంగాణ టీడీపీ మహానాడు కార్యక్రమానికి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు డుమ్మా కొట్టారు. ఈ అంశం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి స్పందించారు. మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదని ఆయన తెలిపారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తననే దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మూడేళ్ల నుంచి చంద్రబాబు తనకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని చెప్పారు. తాను చంద్రబాబును ఉద్దేశించి ఒక్క మాట కూడా ఎక్కడా అనలేదని తెలిపారు. పార్టీకి నష్టం చేస్తున్నవారి గురించి మాట్లాడుతున్నందుకే తనను దూరం పెడుతున్నారని వాపోయారు. తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్ లో కలపాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు ఇంతవరకు స్పందించలేదని చెప్పారు. ఎన్టీఆర్ కు ప్రియ శిష్యుడినైన తనను దూరం పెట్టడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తనను పిలిచి మాట్లాడతారని ఆశిస్తున్నానని చెప్పారు.
motkupalli
Chandrababu
mahanadu
ntr
tTelugudesam

More Telugu News