ntr: ఎన్టీఆర్ .. చరణ్ లకు కథ చెప్పబోతోన్న రాజమౌళి

షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి ఒక మల్టీ స్టారర్ మూవీని రూపొందించనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. గతంలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ 'సింహాద్రి' .. 'యమదొంగ' సినిమాలు చేస్తే, చరణ్ 'మగధీర' చేశాడు. అందువలన ఈ ఇద్దరి హీరోలకి రాజమౌళి పట్ల పూర్తి నమ్మకం వుంది.

ఈ కారణంగానే కథ వినకుండానే ఆయన ప్రాజెక్టుకు ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. బోయపాటితో చరణ్ తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలుకానుంది. ఇక త్రివిక్రమ్ సినిమా 'అరవింద సమేత వీర రాఘవ' కోసం ఎన్టీఆర్ కూడా హైదరాబాద్ లోనే వున్నాడు. అందువలన సాధ్యమైనంత త్వరలో ఇద్దరినీ కలిసి ఒకేసారి కథ వినిపించడానికి రాజమౌళి రెడీ అవుతున్నట్టుగా చెబుతున్నారు. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది.   
Go Back to Shorts
ntr
charan

More Telugu News