Chandrababu: మధ్యాహ్నం హైదరాబాదుకు వస్తున్న చంద్రబాబు

  • హైదరాబాదులో జరగనున్న తెలంగాణ మహానాడుకు వస్తున్న చంద్రబాబు
  • ప్రత్యేక విమానంలో బయల్దేరుతున్న సీఎం
  • రేపు సాయంత్రం ఉండవల్లికి తిరుగుపయనం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మధ్యాహ్నం హైదరాబాద్ వస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో 1.40 గంటలకు హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే తెలంగాణ టీడీపీ మహానాడులో పాల్గొంటారు.

మహానాడు కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత రోడ్డు మార్గం ద్వారా హైదరాబాదులోని తన నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. ఒక రోజు తన కుటుంబంతో గడిపిన తర్వాత 25వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని, ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం బయల్దేరుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 
Chandrababu
Hyderabad
tTelugudesam
mahanadu

More Telugu News