balakrishna: బాలకృష్ణ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం పూరి వెయిటింగ్

షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'పైసా వసూల్' మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పూరితో మరో సినిమా ఉంటుందని ఆ సమయంలోనే బాలకృష్ణ చెప్పారు. బాలకృష్ణతో మరో సినిమా చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అనే ఆశగా ఎదురుచూస్తున్నాను అని పూరి అన్నాడు. రీసెంట్ గా ఆయనను కలిసిన పూరి జగన్నాథ్ .. ఒక కథ వినిపించాడట.

కథ బాగానే ఉందన్న బాలకృష్ణ .. ఇంకా ఓకే చెప్పలేదట. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుందా అనే పూరి ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న బాలకృష్ణ, ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ లోను .. బోయపాటి దర్శకత్వంలోను చేయనున్నారు. ఆ తరువాతనే పూరితో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ వుంది. ఈలోగా పూరి తన తనయుడితో మరో సినిమా చేస్తాడో .. లేదంటే మరో హీరోతో ప్లాన్ చేస్తాడో చూడాలి.
Go Back to Shorts
balakrishna
puri

More Telugu News