Andhra Pradesh: బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా కలుస్తాం: నారా లోకేష్

  • ఇకపై బీజేపీ ఎక్కడా గెలవదు
  • అన్ని పార్టీలూ ఏకం కావాల్సిన సమయం ఇదే
  • ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించే ఆలోచన
  • వెల్లడించిన నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేసిన బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీతో అయినా కలసి పనిచేసేందుకు సిద్ధమేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇకపై బీజేపీ ఏ రాష్ట్రంలోనూ గెలిచే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. బీజేపీపై పోరాడేందుకు అన్ని పార్టీలూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

ఏపీలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, అన్ని పార్టీల నేతలనూ ఆహ్వానించే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని తెలిపారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారని, ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తేనే బీజేపీకి బుద్ధి చెప్పేందుకు వీలవుతుందని అన్నారు.
Andhra Pradesh
Nara Lokesh
BJP
Telugudesam

More Telugu News