Karnataka: కర్ణాటక డీజీపీపై మమతా బెనర్జీ ఫైర్.. బిత్తరపోయిన కుమారస్వామి, దేవెగౌడ!

  • కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి మమత
  • ట్రాఫిక్ ఇబ్బందులపై డీజీపీపై ఆగ్రహం
  • వేదికపైనే పోలీస్ బాస్‌ను నిలదీసిన వైనం
జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. 2019 ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత ప్రమాణ స్వీకార వేదికపై కనిపించింది. బీజేపీ యేతర పార్టీ నాయకులతో వేదిక నిండిపోయింది. అయితే, ఇదే కార్యక్రమానికి హాజరైన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం అంత ఉత్సాహంగా కనిపించలేదు. ట్రాఫిక్ ఏర్పాట్లు ఆమెను తీవ్ర అసహనానికి గురిచేశాయి.

వేదికపైకి వస్తూనే అక్కడ కనిపించిన డీజీపీ నీలమణి రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటీ ఏర్పాట్లు? అంటూ చీవాట్లు పెట్టారు. ఆమె ఆగ్రహాన్ని చూసి కుమారస్వామి, దేవెగౌడ, ఇతర నేతలు బిత్తరపోయారు. ప్రమాణస్వీకారం కోసం కోల్‌కతా నుంచి బెంగళూరుకు చేరుకున్న మమత నేరుగా విధానసౌధకు బయలుదేరారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున వీవీఐపీలు, కాంగ్రెస్, జేడీఎస్ శ్రేణులు హాజరుకావడంతో ఆమె వచ్చే దారిలో ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బందులు ఎదురయ్యాయి. డీజీపీపై మమత ఆగ్రహానికి ఇదే కారణమని చెబుతున్నారు. పోలీస్ బాస్‌పై ఫైర్ అవుతున్న మమత వీడియో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

Karnataka
Kumrara swamy
Mamata Banerjee
DGP

More Telugu News