Somu veerraju: వైసీపీతో పొత్తుపై తన అభిప్రాయాన్ని బయటపెట్టిన సోము వీర్రాజు!

  • నాకున్న సమాచారం ప్రకారం ఉండదు
  • 2019 నాటికి ఆలోచిస్తాం
  • చంద్రబాబుది పరిపాలన కాదు.. వ్యాపారం
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలపై ఆ పార్టీ నేత సోము వీర్రాజు స్పందించారు. తనకున్న సమాచారం ప్రకారం వైసీపీతో బీజేపీ పొత్తు ఉండదని పేర్కొన్నారు. అయితే, 2019లో అప్పటి పరిస్థితులను బట్టి ఆలోచిస్తామని అన్నారు. జగన్‌తో బీజేపీ పొత్తు పెట్టుకుందని పదేపదే చెప్పడం టీడీపీ అభద్రతా భావానికి నిదర్శనమని అన్నారు. మోదీని జగన్ కలిస్తే పొత్తుకోసమేనని అంటున్నారని, అలా ఎలా అనుకుంటారని ప్రశ్నించారు.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిపాలన చేయకుండా వ్యాపారం చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. అందుకనే ఆయన రాహుల్ గాంధీ భుజాలు తడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Somu veerraju
BJP
Jagan
YSRCP
Chandrababu

More Telugu News