Police: తూత్తుకుడికి వెళ్లిన కమలహాసన్‌.. కేసు నమోదు చేసిన పోలీసులు

  • స్టెరిలైట్‌ కాపర్‌ తయారీ ప్లాంటుకు వ్యతిరేకంగా ఆందోళనలు
  • 144 సెక్షన్‌ విధించిన పోలీసులు
  • బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కమల్‌
తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంతకు చెందిన స్టెరిలైట్‌ కాపర్‌ తయారీ ప్లాంటును మూసివేయాలంటూ స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 మంది మృతి చెంది, పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. తూత్తుకుడిలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న క్షతగాత్రులను పరామర్శించడానికి వెళ్లిన మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు కమలహాసన్‌పై పోలీసు కేసు నమోదైంది.

ఆ ప్రాంతంలో 144 సెక్షన్ ఉందని, అయినప్పటికీ కమలహాసన్‌ అక్కడకు వెళ్లారని, అందుకే కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. కాగా, కమలహాసన్ తూత్తుకుడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు విలువ లేకుండాపోయిందని, కాల్పులకు బాధ్యులెవరో తెలపాలని, ప్రజలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Police
Kamal Haasan
Tamilnadu

More Telugu News