Chandrababu: జాతీయ స్థాయి కూటమిని ఏర్పాటు చేయండి: చంద్రబాబును కోరిన మమతా బెనర్జీ

  • కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరైన జాతీయ నేతలు
  • కూటమి గురించి చర్చించిన నేతలు
  • 15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చ
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కోరారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి చేయబోతున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ఉన్న ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలంతా కలసి కూటమి ఏర్పాటు గురించి చర్చించారు. మాయావతి, కేజ్రీవాల్ కూడా ఇదే సూచన చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించగా... ఇతర నేతలంతా ఏకీభవించారు. ఏపీకి బీజేపీ చేస్తున్న అన్యాయం, కేంద్రంపై తాను చేస్తున్న పోరాటాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు.
Chandrababu
mamatha banerjee
front

More Telugu News