Ganta Srinivasa Rao: వైసీపీలో చేరేందుకు గంటా సంప్రదింపులు జరుపుతున్నారు: విజయసాయిరెడ్డి

  • ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారిపోతారు
  • ఆయనకు డబ్బే ప్రధానం
  • నీతి లేని గంటాకు మమ్మల్ని విమర్శించే హక్కు లేదు
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గంటాను గోడ మీద పిల్లిలా పోల్చారు. గంటాకు డబ్బే ప్రధానమని, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే ఆ పార్టీలోకి జంప్ అయిపోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నో పార్టీలు మారిన గంటా... ఇప్పుడు వైసీపీతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు.

నీతి లేని గంటాకు తమను విమర్శించే అర్హత లేదని అన్నారు. విశాఖలో చంద్రబాబు నిర్వహించింది ధర్మపోరాట సభ కాదని అధర్మ పోరాట సభ, అన్యాయమైన సభ అని విమర్శించారు. రాజకీయ సభలను యూనివర్శిటీలలో నిర్వహించరాదన్న జీవో ఉన్నప్పటికీ... యూనివర్శిటీ వీసీ, రిజిస్ట్రార్ లు నిబంధనలను ఉల్లంఘించారని మండిపడ్డారు.
Ganta Srinivasa Rao
Vijay Sai Reddy
Chandrababu

More Telugu News