TTD: ఢిల్లీలో రమణ దీక్షితులు బిజీబిజీ.. బీజేపీ నేతలతో కీలక చర్చలు

  • సుబ్రహ్మణ్య స్వామితో రమణ దీక్షితులు భేటీ
  • టీటీడీ వ్యవహారాలపై చర్చ
  • సీబీఐ విచారణ డిమాండ్ చేస్తోన్న రమణ దీక్షితులు
వివాదాలకు వేదికగా మారుతోన్న తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవహారాలను బీజేపీ నేతలతో చర్చించేందుకు ఆ దేవాలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఢిల్లీకి వెళ్లారు. పలువురు బీజేపీ నేతలను కలుస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో సమావేశమయ్యారు. టీటీడీలో పలువురు చేస్తోన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తానని ఇటీవలే సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఈ విషయంపై సీబీఐతో విచారణ జరిపించాలని రమణ దీక్షితులు కూడా ఇటీవల డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. రమణ దీక్షితులు మరికొంత మంది బీజేపీ నేతలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
TTD
Tirumala
subrahmaniam
New Delhi

More Telugu News