Pawan Kalyan: ఈ విషాద వార్త నన్ను కలిచి వేసింది: బండారు వైష్ణవ్‌ మృతిపై పవన్‌ కల్యాణ్‌

  • తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను
  • దత్తాత్రేయకి నా ప్రగాఢ సానుభూతి
  • వైష్ణవ్‌ ఆత్మకు శాంతి చేకూరాలి
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఒక్కగానొక్క కుమారుడు వైష్ణవ్‌ హఠాన్మరణం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. ఎంబీబీఎస్‌ చదువుతూ భవిష్యత్తుకి బాటలు వేసుకుంటోన్న వైష్ణవ్ చిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూయడం బాధాకరమని, ఈ విషాద వార్త తనను కలిచి వేసిందని కొద్ది సేపటి క్రితం విడుదల చేసిన ఓ ప్రకనటలో పేర్కొన్నారు.

దత్తాత్రేయకి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని చెప్పారు. వైష్ణవ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని, పుత్రశోకాన్ని తట్టుకునే మనోస్థైర్యాన్ని దత్తాత్రేయకి, ఆయన కుటుంబానికి భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
Pawan Kalyan
Jana Sena
dathathreya

More Telugu News