prakashraj: తూత్తుకుడిలో కాల్పులు... తమిళనాడు సర్కారుపై మండిపడ్డ నటుడు ప్రకాశ్ రాజ్

  • ఇది వెన్నెముకలేని తమిళ సర్కారు చర్య
  • ప్రజల మొరను మీరు ఆలకించలేరు
  • కాలుష్యంపై వారి ఆవేదనను అర్థం చేసుకోలేరంటూ ట్వీట్
తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ స్మెల్టర్ ప్లాంటు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులు జరిపి 11 మందిని పోలీసులు పొట్టన పెట్టుకోవడంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. తమిళనాడు సర్కారుపై నిప్పులు చెరిగారు. నిరసనకు దిగిన ప్రజలను చంపడం అన్నది ముందు చూపులేని, వెన్నెముక లేని తమిళనాడు సర్కారు చర్యగా పేర్కొన్నారు.

‘‘మీరు ప్రజల మొరను ఆలకించలేరు. కాలుష్యానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్న ప్రజల ఆవేదనను మీరు అర్థం చేసుకోలేరు. అధికారంలో కొనసాగేందుకు కేంద్రం పల్లవికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారా..?’’ అని ప్రకాశ్ రాజ్ తమిళనాడు సర్కారును దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు. 
prakashraj
thuttukudi

More Telugu News