Pawan Kalyan: రక్తం చిందించడానికి కూడా వెనకాడదు ఈ శ్రీకాకుళం నేల!: పవన్ కల్యాణ్‌

  • ఎక్కడైతే దౌర్జన్యం ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది
  • అలాంటి తిరుగుబాటు చేసిన నేల మన శ్రీకాకుళం
  • అలాంటి నేల నుంచి మన పోరాటం ప్రారంభించాం
  • యువతరానికి ఏ సంపద మిగిల్చారు?
ఎక్కడైతే దోపిడీ రాజకీయ వ్యవస్థ ఉంటుందో, ఎక్కడైతే దౌర్జన్యం ఉంటుందో అక్కడ కచ్చితంగా తిరుగుబాటు ఉంటుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో హరిశంకర్ థియేటర్ నుంచి కాశిబుగ్గ బస్టాండ్ వరకు జరిగిన కవాతులో పాల్గొన్న పవన్ కల్యాణ్‌.. అనంతరం కాశిబుగ్గ బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.

తిరుగుబాటు చేసిన నేల మన శ్రీకాకుళమని, రక్తం చిందించడానికి కూడా వెనకాడదని అన్నారు. అలాంటి నేల నుంచి మన పోరాటం ప్రారంభించామని పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థ కుళ్లిపోతోందని, తనకు ఒక్కటే గుర్తు కొస్తోందని, యువతరానికి ఏ సంపద మిగిల్చారని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. యుద్ధాలు, రక్తాలు, కన్నీరు, కలలు, మోసాలు తప్పా ఏం ఇచ్చారని నిలదీశారు. జరుగుతోన్న అన్యాయానికి తాను వ్యతిరేకంగా గళమెత్తానని, దశాబ్దాల పాటు మన పాలకులు చేసిన తప్పులకి మనం ఇప్పుడు సమస్యలు ఎదుర్కుంటున్నామని అన్నారు.
Pawan Kalyan
Jana Sena
Srikakulam District

More Telugu News