Telugudesam: బీజేపీ, జగన్, పవన్ లు టీడీపీని ఏమీ చేయలేరు: మంత్రి అచ్చెన్నాయుడు

  • కష్టకాలంలో టీడీపీ పాలనా పగ్గాలు చేపట్టింది
  • విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని చంద్రబాబు గట్టెక్కిస్తున్నారు
  • కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల గొంతు కోస్తే.. బీజేపీ వంచన చేసింది
టీడీపీపై బీజేపీ, వైఎస్సార్ సీపీ, జనసేన పార్టీలు మూకుమ్మడి దాడి ప్రారంభించాయని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ, జగన్, పవన్ లు టీడీపీని ఏమీ చేయలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల గొంతు కోస్తే.. బీజేపీ వంచన చేసిందని, నాలుగేళ్లలో తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పి, ఓట్లు అడుగుతామని అన్నారు.

కష్టకాలంలో టీడీపీ పాలనా పగ్గాలు చేపట్టిందని, విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని చంద్రబాబు గట్టెక్కించారని ప్రశంసించారు. 2019లో చంద్రబాబు గెలవాల్సిన చారిత్రక అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి అభిప్రాయపడ్డారు. జగన్ తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నారని, రాజీనామాల డ్రామాలాడుతున్న వైసీపీ రాష్ట్రానికి ద్రోహం చేస్తోందని ఆరోపించారు.
Telugudesam
atchanaidu

More Telugu News