pavan: పవన్ తో నా పరిచయం అలా జరిగింది: కమెడియన్ అలీ

  • ఒకసారి చిరంజీవి గారి కోసం ఆయన ఇంటికిళ్లాను
  • అక్కడే మొదటిసారి పవన్ ను చూశాను 
  • నన్ను చాలా ఆత్మీయంగా పలకరించాడు
పవన్ కల్యాణ్ .. అలీ మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. పవన్ తో కలిసి అలీ చాలా సినిమాల్లో నటించాడు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ, పవన్ తో తనకి పరిచయం ఎలా జరిగిందనేది చెప్పుకొచ్చాడు. " చిరంజీవి గారు 'ముగ్గురు మొనగాళ్లు' సినిమా చేస్తున్న రోజులవి. ఆ సినిమా కోసం వర్షంలో ఫైట్స్ చేసిన ఆయన, ఆ తరువాత ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు"

"ఆ సమయంలో నేను ఫోన్ చేస్తే .. ఇంటికి రమ్మన్నారు. దాంతో నేను చిరంజీవిగారి ఇంటికి వెళ్లాను. మొదటిసారి అక్కడే పవన్ కల్యాణ్ ను చూశాను. 'మీరొస్తారని అన్నయ్య చెప్పారు' అంటూ ఆయన చాలా గౌరవంగా పలకరించారు. అలా ఒకటి రెండుసార్లు ఇద్దరం కలుసుకోవడం జరిగింది. ఆ తరువాత ఆయన సినిమాల్లోకి రావడం .. ఆయనతో కలిసి నటించడం జరిగింది. నా గురించి చిరంజీవి గారు .. నాగబాబు గారు పవన్ కి మంచిగా చెప్పడం వలన కూడా ఆయన నాకు మరింత దగ్గరయ్యారు. అలా మేం కలిసి నటించే సినిమాలు పెరుగుతూ ఉండటంతో .. మా మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతూ పోయింది" అని చెప్పుకొచ్చారు.      
pavan
ali

More Telugu News