TTD: రమణ దీక్షితులు సంచలన నిర్ణయం... ఆమరణ దీక్ష?

  • టీటీడీపై పలు ఆరోపణలు చేసిన రమణ దీక్షితులు
  • న్యూఢిల్లీకి వెళ్లి హోమ్ మంత్రికి ఫిర్యాదు 
  • ఆమరణ దీక్షకు దిగే యోచనలో మాజీ ప్రధానార్చకులు
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని, వారి వైఖరితో శ్రీవారి సంపద కొల్లగొట్టబడుతోందని ఇటీవల ఆరోపిస్తున్న ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు తన దూకుడు పెంచారు. ఢిల్లీకి వెళ్లి హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తిరుమలలో జరుగుతున్న విషయాలపై ఫిర్యాదు చేసిన ఆయన, టీటీడీ వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు దిగాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆభరణాలు అదృశ్యం కావడం, స్వామివారికి సేవల్లో లోపం జరుగుతుండటంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న ఆయన, ఈ సాయంత్రం బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని కలిసి తనకు మద్దతుగా నిలవాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
TTD
Tirumala
Tirupati
Ramana Deekshitulu

More Telugu News