janasena: జనసేనలోకి ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే?

  • జనసేనలో చేరే యోచనలో నరేష్ కుమార్
  • ఇప్పటికే జరిగిన చర్చలు
  • వచ్చే నెలలో పార్టీ మారే అవకాశం
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ (లల్లూ) జనసేన పార్టీలోకి చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత మూడు రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ప్రాంతంలో యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొందరు నేతలు లల్లూ విషయాన్ని పవన్ వద్ద ప్రస్తావించినట్టు సమాచారం.

మరోవైపు లల్లూ అనుచరులు, పవన్ సన్నిహితుల మధ్య చర్చలు జరిగినట్టు కూడా చెబుతున్నారు. పవన్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని కూడా అంటున్నారు. వచ్చే నెలలో జనసేనలో లల్లూ చేరే అవకాశం ఉందని సమాచారం. ఈ అంశంపై ఇటు పవన్ కానీ, అటు లల్లూ కానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. 
janasena
Pawan Kalyan
naresh kumar
itchapuram

More Telugu News