Chandrababu: బీజేపీ ఓడిపోయినందుకు నేనెంత సంతోషించానో: చంద్రబాబు

  • బీజేకి ప్రజలు తగిన శాస్తి చేశారు
  • నమ్మి జత కడితే ముంచేశారు
  • సుప్రీం చొరవ వల్లే కుమారస్వామి సీఎం
కర్ణాటకలో బీజేపీ ఓటమిని తానెంతగానో సంతోషించానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బల నిరూపణలో విఫలమైనందుకు చాలా ఆనందం కలిగిందన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని రొద్దం మండలం తురకలపట్నంలో సోమవారం నిర్వహించిన జలహారతి, గ్రామదర్శని, నీరు-ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి కోసమే గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు.

బీజేపీని నమ్మి ఆ పార్టీతో వెళ్తే తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. తెలుగు వారికి జరిగిన అన్యాయంపై కర్ణాటక ఓటర్లకు పిలుపునిచ్చానని, ఆ పర్యవసానమే బీజేపీ ఓటమి అని అన్నారు. ఆ పార్టీ ఓటమితో తాను చాలా సంతోషించినట్టు చంద్రబాబు పేర్కొన్నారు. అవినీతి పరుడితో కలిసి ముందుకెళ్లాలన్న బీజేపీ కుట్రలు సాగలేదని, సుప్రీంకోర్టు చొరవతో కుమారస్వామి సీఎం అవుతున్నారని పేర్కొన్నారు.
Chandrababu
Andhra Pradesh
Telugudesam
BJP
Karnataka

More Telugu News