ap express: ఢిల్లీ నుంచి విశాఖ వస్తున్న ఏపీ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం!

  • గ్వాలియర్ దగ్గర సంఘటన..  ఏసీ బోగీ పూర్తిగా దగ్ధం
  • షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందంటున్న అధికారులు
  • ప్రయాణికులంతా సేఫ్ 
ఏపీ ఎక్స్ ప్రెస్ (ఢిల్లీ నుంచి విశాఖపట్టణం) రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఏసీ బోగీ పూర్తిగా దగ్ధమైంది. ఈరోజు ఉదయం ఆరుగంటలకు ఢిల్లీలో ఏపీ ఎక్స్ ప్రెస్ బయలుదేరింది. గ్వాలియర్ ప్రాంతానికి సమీపిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఏసీ బోగీ బీ5లో మంటలు చెలరేగాయి.

ఈ సమాచారం తెలుసుకున్న సంబంధిత అధికారులు రైలును వెంటనే నిలిపివేశారు. తక్షణ చర్యలను అధికారులు ప్రారంభించారు. ఈ సంఘటనతో భయపడిపోయిన ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ సంఘటనలో ప్రయాణికులెవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నట్టు సమాచారం.
ap express
delhi to vishaka

More Telugu News