Tirumala: తిరుమల పరిణామాలపై చంద్రబాబుకు ఓ లేఖ రాసిన ఐవైఆర్

  • రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలపై విచారణ అవసరం
  • పోటు ప్రాంతంలో తవ్వకాలు జరిపే అధికారం ఎవ్వరికీ లేదు
  • ప్రతి వ్యవస్థ, ప్రభుత్వంలోని లోపాలు తెలిపే వ్యక్తులకు భద్రత ఉండాలి
తిరుమల పరిణామాలపై సీఎం చంద్రబాబుకు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మరోసారి బహిరంగ లేఖ రాశారు. టీటీడీ పూర్వ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలపై విచారణ అవసరమని, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

పోటు ప్రాంతంలో తవ్వకాలు జరిపే అధికారం ఎవ్వరికీ లేదని, పురావస్తు శాఖ తనిఖీకి, ఈ చర్యకు సంబంధం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పోటు ప్రాంతంలో తవ్వకంపైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి వ్యవస్థ, ప్రభుత్వంలోని లోపాలను తెలిపే వ్యక్తులకు భద్రత ఉండాలని తన లేఖలో చంద్రబాబును కోరారు.
Tirumala
Chandrababu
iyr

More Telugu News