రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోనున్న కమలహాసన్!
- ఏఎంఎంకే, పీఎంకేలతో పొత్తు పెట్టుకునే అవకాశం
- రెండు రోజుల క్రితం కమల్ నిర్వహించిన సమావేశానికి హాజరైన నేతలు
- దినకరన్ పార్టీ పలు జిల్లాల్లో బలపడిందని కమల్ కు సూచిస్తున్న నేతలు
పీఎంకే తరపున సీనియర్ నేత అన్బుమణి రాందాస్ హాజరు కావడం కమల్ ను ఎంతో సంతోషపెట్టిందని చెబుతున్నారు. దినకరన్ నాయకత్వంలోని ఏఎంఎంకే పార్టీ ఆర్కేనగర్ ఉపఎన్నికలో అన్నాడీఎంకేని మట్టికరిపించిందని... పలు జిల్లాల్లో ఆ పార్టీకి ఓటు బ్యాంకు పెరిగిందని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బలమైన కూటమిని ఏర్పాటు చేయవచ్చని మక్కల్ నీదిమయ్యం పార్టీ నేతలు కమల్ కు సూచిస్తున్నారట. ఈ సూచనలను కమల్ కూడా సీరియన్ గానే పరిశీలిస్తున్నట్టు సమాచారం.