తల్లిని వేధించేవారికి ఆమె ఇంట్లోకి ప్రవేశించే హక్కు ఉండదు: బాంబే హైకోర్టు సంచలన తీర్పు
- తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారన్న వృద్ధురాలు
- కుమారుడి కుటుంబాన్ని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న తల్లి
- బాధిత మహిళకు అనుకూలంగా తీర్పు
ఈ కేసులో భాగంగా న్యాయమూర్తి ఎదుట హాజరైన వైద్యురాలైన బాధిత వృద్ధురాలు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా కుమారుడు తనను చిత్ర హింసలు పెడుతున్నాడని, మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని తెలిపింది. ఇక ఈ వేధింపులు భరించలేనని మొరపెట్టుకుంది. వాదనలు విన్న కోర్టు ఆ ఇంటిని ఖాళీ చేయాలని, ఆ ఇంట్లో ఉన్న వారి వస్తువులను హైకోర్టు కమిషనర్ సమక్షంలో తీసుకెళ్లాలని తీర్పు చెప్పింది. ఇకపై కుమారుడి నుంచి ఎటువంటి బాధలు ఉండవని బాధిత వృద్ధురాలికి కోర్టు హామీ ఇచ్చింది.