Pawan Kalyan: లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?: పవన్ కల్యాణ్

  • మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రిగారి అబ్బాయి
  • ప్రభుత్వం.. ఖజానా కూడా వాళ్ల చేతుల్లోనే ఉంది
  • తాళాలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి
‘లోకేషా.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?’ అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో.. ‘లోకేశ్ గురించి మాట్లాడాలి’ అని ఆ సభకు హాజరైన వారు నినాదాలు చేశారు. దీంతో, పవన్ స్పందిస్తూ, ‘మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగారి అబ్బాయి. రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా? ప్రభుత్వం వాళ్ల చేతుల్లో ఉంది. ఖజానా కూడా వాళ్ల చేతుల్లోనే ఉంది. తాళాలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. అంతా వాళ్లిష్టం..వాళ్లేమైనా చేసుకోనీ!’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Pawan Kalyan
Nara Lokesh
ichapuram

More Telugu News