bsnl 4g: బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులు త్వరలో దేశవ్యాప్తంగా.. ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ

  • డిజిటల్ ఇండియా కార్యక్రమానికి బీఎస్ఎన్ఎల్ చేయూత అవసరం
  • దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులతోనే సాధ్యమని అభిప్రాయం
  • ఇప్పటి వరకు బీఎస్ఎన్ఎల్ 2జీ, 3జీకే సపోర్ట్
ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ త్వరలో దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో 4జీ సర్వీసులను ఆరంభించనుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం విజయవంతం కావాలంటే బీఎన్ఎన్ఎల్ 4జీ సర్వీసులు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావడమే పరిష్కారమని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, దీనిపై బీఎన్ఎన్ఎల్ ఇంత వరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

 ప్రస్తుత బీఎన్ఎన్ఎల్ కస్టమర్లకు అదే సిమ్ ఉంటే చాలని, కొత్త కస్టమర్లు యూనివర్సల్ సిమ్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. 2009లో బీఎస్ఎన్ఎల్ 3జీ సర్వీసులు ఆరంభించింది. ఇప్పటికీ 3జీ సాయంతోనే డేటా డిమండ్ ను నెట్టుకొస్తోంది. ఇదే సమయంలో ప్రైవేటు రంగ ప్రధాన కంపెనీలన్నీ 4జీ సర్వీసులతో వేగంతో కూడిన డేటాను అందిస్తూ కస్టమర్లకు చేరవయ్యాయి. ఆలస్యంగా అయినా ప్రభుత్వ ప్రోత్సాహంతో 4జీలోకి బీఎన్ఎన్ఎల్ అడుగిడుతోంది.
bsnl 4g

More Telugu News