Prakash Raj: కర్ణాటక ఇక కాషాయమయం కావట్లేదు: ప్రకాశ్‌ రాజ్‌ స్పందన

  • రంగురంగులుగానే ఉంటుంది
  • ఆట మొదలు పెట్టకుండానే ముగిసింది 
  • నేను ప్రజల తరఫున నిలబడడాన్ని ఎప్పటికీ కొనసాగిస్తాను
కర్ణాటకలో జరుగుతోన్న రాజకీయాలపై సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు. కర్ణాటక ఇక కాషాయమయం కావట్లేదని, రంగురంగులుగానే ఉంటుందని ట్వీట్ చేశారు. ఆట మొదలు పెట్టకుండానే ముగిసిందని అవిశ్వాస తీర్మానాన్ని ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. అయితే, మరింత మురికివంతమైన రాజకీయాలను ఎదుర్కునేందుకు మాత్రం ప్రజలు సిద్ధంగా ఉండాలని ప్రకాశ్ రాజ్‌ అన్నారు.

తాను ప్రజల తరఫున నిలబడడాన్ని ఎప్పటికీ కొనసాగిస్తానని ప్రకాశ్‌ రాజ్‌ తెలిపారు. తాను ఏ పార్టీకి మద్దతు తెలపట్లేదని బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడుతున్నానని ఆయన గతంలో చెప్పిన విషయం తెలిసిందే. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ప్రకాశ్‌ రాజ్‌ మాట్లాడుతూ కన్నడ ప్రజలు మతతత్వ పార్టీలకు మద్దతు పలకరని కూడా అన్నారు.           
Prakash Raj
Karnataka
Congress
BJP

More Telugu News