Congress: యడ్యూరప్ప అసమర్థుడిగా పరారయ్యారు: సిద్ధరామయ్య

  • అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటామని అన్నారు
  • బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు అభ్యంతరకరం
  • ఎమ్మెల్యేల కొనుగోలును గవర్నర్ ప్రోత్సహించారు
అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటామని చెప్పుకున్న బీజేపీ నేత యడ్యూరప్ప అసమర్థుడిగా పరారయ్యారని, ఇది ప్రజాస్వామ్య విజయమని కాంగ్రెస్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను కర్ణాటక గవర్నర్‌ ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని మండిపడ్డారు. తాము కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను సంప్రదించింది వాస్తవమేనని యడ్యూరప్ప ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలును గవర్నర్ ప్రోత్సహించారని సిద్ధరామయ్య విమర్శించారు.                         
Congress
BJP
Karnataka

More Telugu News