nitin gadkari: అవినీతికి పాల్పడే కాంట్రాక్టర్లను తీవ్రంగా హెచ్చరించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

  • అవినీతికి పాల్పడితే బుల్ డోజర్ కింద మీరుంటారు
  • రహదారుల నిర్మాణం నిమిత్తం వెచ్చించే సొమ్ము దేశ ప్రజలది
  • అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో సహించనని హెచ్చరించిన గడ్కరీ
అవినీతికి పాల్పడే కాంట్రాక్టర్లను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా హెచ్చరించారు. మధ్యప్రదేశ్ లోని బేతుల్ లో అసంఘటిత కార్మికులు ఏర్పాటు చేసిన  ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ‘బుల్ డోజర్ కింద రాళ్లకు బదులుగా మీరుంటారు’ అంటూ అవినీతికి పాల్పడే కాంట్రాక్టర్లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

రహదారుల పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఒకవేళ కాంట్రాక్టర్లు నిధుల వినియోగం విషయంలో అవినీతికి పాల్పడితే బుల్ డోజర్ కింద నలిగిపోయే రాళ్ల కింద ఉంటారని హెచ్చరించారు. రహదారుల నిర్మాణం నిమిత్తం వెచ్చించే సొమ్మంతా దేశ ప్రజలదని, అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో సహించనని నితిన్ హెచ్చరించారు.
nitin gadkari
contractors

More Telugu News