siddaramaiah: అసెంబ్లీ మొత్తం ఉత్కంఠగా ఉంటే.. సిద్ధరామయ్య మాత్రం కునుకు తీశారు

  • ఉత్కంఠభరితంగా కార్ణాటక అసెంబ్లీ
  • బలపరీక్షపై టెన్షన్ గా ఉన్న నేతలు
  • టెన్షన్ లేకుండా సభలో హాయిగా కునుకు తీసిన సిద్ధూ
ఉత్కంఠభరిత వాతావరణం మధ్య కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కార్యక్రమం కొనసాగింది. ప్రస్తుతం అసెంబ్లీకి లంచ్ బ్రేక్ ప్రకటించారు. 3.30 గంటలకు మళ్లీ సభ ప్రారంభమవుతుంది. 4 గంటలకు బలపరీక్ష జరుగుతుంది.

అంతకు ముందు... సభలో అందరి ముఖంలో టెన్షన్ కనిపించింది. ఏం జరగబోతోందో అనే ఆందోళనలో సభ్యులంతా ఉన్నారు. ఓవైపు యడ్యూరప్పతో శ్రీరాములు మంతనాలు చేస్తూ కనిపించారు. అయితే, ఇదేమీ పట్టనట్టుగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం హాయిగా సభలో కునుకు తీశారు. ఈ సన్నివేశాన్ని చూసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు గురయ్యారు.
siddaramaiah
yeddyurappa
sleep
assembly
floor test

More Telugu News