bd patil: డైరెక్ట్ గా బేరసారాలు జరిపిన యడ్యూరప్ప.. ఎమ్మెల్యేతో యడ్డీ జరిపిన సంభాషణ ఇదే..!

  • కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ కు యడ్డీ ఆఫర్
  • మంత్రి పదవి, కావాల్సినంత సాయం
  • ఇంకా కావాలంటే శ్రీరాములుతో మాట్లాడతా
కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. డబ్బు, మంత్రి పదవుల ఆశ చూపి, ఇతర పార్టీల నేతలను లొంగదీసుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలు వెలుగు చూస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ తో ముఖ్యమంత్రి యడ్యూరప్ప జరిపిన ఫోన్ సంభాషణ ఇప్పుడు వేడిని మరింత పెంచింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇదే...

యడ్యూరప్ప: ఎక్కడున్నారు?
పాటిల్: బస్సులో ఉన్నాం. కొచ్చికి వెళుతున్నాం.
యడ్యూరప్ప: కొచ్చికి వెళ్లకు. వెనక్కి వచ్చేయ్.
పాటిల్: నా పొజిషన్ ఏమిటో ముందు చెప్పండి.
యడ్యూరప్ప: యూ విల్ బికమ్ మినిస్టర్. కావాల్సినంత సాయం కూడా చేస్తాం.
పాటిల్: నాతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
యడ్యూరప్ప: వాళ్లను కూడా పిలుచుకుని రా. ఇంకా ఏమైనా కావాలంటే శ్రీరాములుతో మాట్లాడతా.
పాటిల్: అలాగే అన్నా.
యడ్యూరప్ప: ఏం చేయాలనుకుంటున్నావు?
పాటిల్:  మీరు చెప్పినట్టే చేద్దాం. ఐదు నిమిషాల్లో మళ్లీ ఫోన్ చేస్తా. 
bd patil
yeddyurappa
phone
conversation
karnataka
horse trading

More Telugu News