Andhra Pradesh: కర్ణాటకలో పరిస్థితి దారుణంగా ఉంది.. బీజేపీ కుయుక్తులు పన్నుతోంది!: సీఎం చంద్రబాబు

  • అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తున్నారు
  • ఏపీపై కేంద్రం కన్నుపడుతోంది
  • శాంతిభద్రతల విషయంలో కుట్రలు చేయాలని చూస్తే మక్కెలిరగ్గొడతా
కర్ణాటకలో చోటుచేసుకున్న రాజకీయాపరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో పరిస్థితి దారుణంగా ఉందని, అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. బీజేపీకి మెజారిటీ లేకున్నా అధికారం చేజిక్కించుకునేందుకు కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు.

 గతంలో తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో కూడా బీజేపీ ఇదేవిధంగా ప్రవర్తించిందని, ఇప్పుడు కర్ణాటకలో మళ్లీ ఇదే వ్యవహారానికి పాల్పడుతోందని తూర్పారబట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీపై కేంద్రం కన్నుపడుతోందని, ఎన్నికల ముందు మోదీ-అమిత్ షా ఏం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. శాంతిభద్రతల విషయంలో కుట్రలు చేయదలచుకున్నవారిని మక్కెలిరగ్గొడతానని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు
Andhra Pradesh
Chandrababu

More Telugu News