Karnataka: మిస్టర్ యడ్యూరప్పకు ఓటమి ఖాయం: చిదంబరం

  • సుప్రీంకోర్టుకు వందనం
  • బీజేపీ ప్రతీ పన్నాగం ఓటమి పాలవుతుంది
  • ప్రజా తీర్పును గౌరవిస్తారన్న ఆశాభావం
కర్ణాటక రాష్ట్ర పరిణామాలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం స్పందించారు. సభలో బలనిరూపణను వాయిదా వేసేందుకు, అడ్డుకునేందుకు బీజేపీ చేసే ప్రతీ పన్నాగం ఓడిపోతుందన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు మిస్టర్ యడ్యూరప్పను తప్పక ఓడిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఈ మేరకు చిదంబరం ట్విట్టర్లో తన అభిప్రాయాలు పోస్ట్ చేశారు. కర్ణాటకలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్నదే కాదు, ఎవరు తమ ఓటర్లకు విధేయులుగా ఉంటారు, వారి తీర్పును గౌరవిస్తారన్నదే ముఖ్యమన్నారు. ‘‘సుప్రీంకోర్టుకు నా సెల్యూట్. ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ విధానానికి కట్టుబడి రాజ్యాంగాన్ని కాపాడాలి’’ అని చిదంబరం ట్వీట్ చేశారు.
Karnataka
chidambaram

More Telugu News