nani: నానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన మంచు లక్ష్మి

  • బిగ్ బాస్-2కు హోస్ట్ గా వ్యవహరించనున్న నాని
  • అఫీషియల్ గా అనౌన్స్ చేసిన యాజమాన్యం
  • నాని అదరగొడతాడన్న మంచు లక్ష్మి
త్వరలోనే 'బిగ్ బాస్-2' రియాలిటీ షో ప్రారంభంకానుంది. సీజన్-1కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, సీజన్-2కు హీరో నాని హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో... నానిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని రియాలిటీ షో యాజమాన్యం అఫీషియల్ గా ప్రకటించింది. నానిని ఎంపిక చేయడం పట్ల మంచు లక్ష్మి స్పందించింది. "చాలా గొప్ప అనౌన్స్ మెంట్. నానిని హోస్ట్ గా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. నానీ, ఆల్ ది బెస్ట్. నాకు తెలుసు.. నువ్వు అదరగొడతావు" అంటూ ట్వీట్ చేసింది.
nani
manchu lakshmi
bigboss 2

More Telugu News