truck: పొద్దున్నే తెల్లారిన బతుకులు.. ట్రక్కు బోల్తాపడి 19 మంది దుర్మరణం
- గుజరాత్‌లో ఘటన
- సిమెంట్ బస్తాలు మీదపడడంతో ఊపిరాడక మృతి
- పరారీలో ట్రక్ డ్రైవర్
గుజరాత్‌లో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ బస్తాలతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. భావ్‌నగర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై బవల్యాలి సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
సిమెంట్ బస్తాలు మీద పడడంతో ఊపిరి ఆడక చాలామంది మరణించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా సుల్తాన్‌పూర్ వాసులుగా తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే బవల్యాలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.