Kumaraswamy: ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేల హైజాక్.. బీజేపీపై కుమారస్వామి ఫైర్

  • హైజాక్ అయిన ఎమ్మెల్యేల్లో ఒకరు టచ్‌లోకి వచ్చారు
  • అంతిమ విజయం మాదే
  • మీడియాతో కుమారస్వామి
తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను బీజేపీ హైజాక్ చేసిందని జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు. బెంగళూరులో ఉండగానే వారిని హైజాక్ చేసిందని, వారిలో ఒకరు ఇప్పుడు తమతో టచ్‌లోకి వచ్చారని తెలిపారు. బలపరీక్ష సమయానికి ఆయన తమతో చేరుతారని అన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లడానికి ముందు కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అంతిమ విజయం తమదేనని తేల్చి చెప్పారు.
Kumaraswamy
Karnataka
JDS
Hyderabad

More Telugu News