YSRCP: ప్రతి ఏడాది నేనొచ్చి ధర్నా చేస్తే గానీ మద్దతు ధర దక్కడం లేదు!: వైఎస్ జగన్

  • పామాయిల్, పొగాకు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది
  • చంద్రబాబు వల్లే పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు రావట్లేదు
  • ‘కాళేశ్వరం’ పనులు జరిగినట్టు ‘పోలవరం’ పనులు జరగట్లేదు
ప్రతి ఏడాది తానొచ్చి ధర్నా చేస్తే గానీ రైతులకు మద్దతు ధర దక్కడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లకు వచ్చిన జగన్ మాట్లాడుతూ, పామాయిల్ రైతులు, పొగాకు రైతులకు మద్దతు ధర లభించకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.

ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ, చంద్రబాబు వల్లే ఈ ప్రాజెక్టుకు నిధులు రావడం లేదని, మొత్తం అవినీతిమయమైపోయిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పనులు రోజుకు 22 క్యూబిక్ కిలోమీటర్ల మేరకు జరుగుతున్నాయని, అదే సమయంలో ‘పోలవరం’ ప్రాజెక్టు పనులు రోజుకు 3 క్యూబిక్ కిలోమీటర్లు కూడా జరగట్లేదని విమర్శించారు.
YSRCP
Jagan
nalla jarla

More Telugu News