Tollywood: ఎన్జీవో సంస్థకు మహేశ్ బాబు దంపతుల ఆర్థిక సాయం!

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ హీరో మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్ దంపతులు మరో మారు తమ సహృదయతను చాటుకున్నారు. మురికివాడల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఓ ఎన్జీవో సంస్థకు మహేశ్ దంపతులు ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని సదరు సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

‘భరత్ అనే నేను’ చిత్రం విడుదలకు ముందే మహేశ్ బాబు దంపతులు ఈ ఆర్థికసాయం అందజేశారని తెలిపారు. అప్పుడే, ఈ విషయమై ఓ ప్రకటన చేద్దామనుకున్నాం కానీ, ఈ సినిమా ప్రచారం కోసమే ఇలా చేశారనే వ్యాఖ్యలు వినపడతాయని భావించి కొంచెం ఆలస్యంగా ఈ ప్రకటన చేశామని చెప్పారు. 
Go Back to Shorts
Tollywood
Mahesh Babu

More Telugu News