strike: రేపు దేశ వ్యాప్తంగా ధర్నాలకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపు

  • కర్ణాటక గవర్నర్‌ తీరుపై ఆగ్రహం 
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఆందోళనలు
  • అన్ని రాష్ట్రాల రాజధానుల్లో నిరసన కార్యక్రమాలు
కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీని ఆహ్వానించిన గవర్నర్‌ వజుభాయ్‌ వాలా తీరు పట్ల కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ రేపు దేశ వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పేర్కొంటూ ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ అశోక్‌ గెహ్లాట్ కాంగ్రెస్‌ నేతలకు పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాల రాజధానులతో పాటు  జిల్లాల ప్రధాన కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలను ఎండగట్టాలని అన్నారు.
strike
Congress
India

More Telugu News